త్వరలో అమృత-ప్రణయ్ స్టోరీని మూవీ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ..! కోపంలో అమృత..!

0
66

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయన అనుకున్నది చేసేస్తాడు ఎవరు ఏమనుకున్నా అసలు పట్టించుకోడు. ఈయన ఎన్నో వివాదాస్పద సినిమాలు చేసాడు తద్వారా ఈయన డేరింగ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. తాజాగా RGV ఫాదర్స్ డే సందర్భంగా అమృత-ప్రణయ్ స్టోరీ తెరకెక్కించబోతున్నా అని తెలిపారు దీనిపై అమృత సోషల్ మీడియాద్వారా ‘మిస్టర్ వర్మ’ మీకు ఆడవాళ్ల గౌరవం గురించి చెప్పే తల్లి లేనందుకు చింతిస్తున్నాను. RIP అని పేర్కొన్నారు. నా భర్త ప్రణయ్ హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు మేము భయంతోనే బతుకుతున్నం. ఇప్పుడు మా జీవితాన్ని సినిమా తీస్తున్నట్లు RGV ప్రకటించడం కొత్త సమస్యగా మారింది” అని పేర్కొన్నారు. నాకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులకు తప్ప నా జీవితం గురించి ఎవరికీ తెలియదు. వర్మ సినిమాలో ఎలాంటి నిజాలు ఉండదని అన్ని కల్పితాలు అని కొట్టిపారేశారు. తండ్రిలేని తన బిడ్డతో తాను ఒక సాధారణ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నానని, అలానే బతకనివ్వండి అని కోరారు. వర్మపై తాను కేసు పెడితే మళ్లీ అది ఆయనకే ప్రచారంగా మారుతుందని, అందుకే కేసు పెట్ట దలచుకోలేదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here