బెదిరింపు ఏదైనా.. మేము భారత్‌కే అండగా ఉంటాం..

28
American military support to India

భారత్‌, అమెరికా దేశాలు బేసిక్ ఎక్స్‌చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్‌(బీఈసీఏ) ఒప్పందం చేసుకున్నాయి. సైనిక సాంకేతిక అంశంపై రెండు దేశాలు పరస్పరం సహకారం అందించుకోనున్నాయి. అగ్రిమెంట్‌పై సంతకాలు చేసినట్లు రక్షణమంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి జీవేశ్ నందన్ వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో మీడియాతో మాట్లాడారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు మరింత చేరువయ్యాయని, రెండు దేశాల మధ్య కొత్త యుగం ప్రారంభం అవుతుందన్నారు.. గత ఏడాది తరహాలోనే తమ విధానాలకు కట్టుబడి ఉన్నామని, మునుముందు ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు. అనంతరం 2+2 మంత్రుల సమావేశం తర్వాత కూడా మైఖేల్ పొంపియో మీడియాతో మాట్లాడారు.

భారత సైనిక దళాలకు చెందిన అమర సైనికులకు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. భారత సైనిక దళాల్లో కర్తవ్య నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన వారికి గౌరవ సూచకంగా తాము ఇవాళ నేషనల్ వార్ మెమోరియల్‌ను విజిట్ చేసినట్లు తెలిపారు. ఇటీవల లడాఖ్ సరిహద్దులోని గాల్వన్ లోయలో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది భారతీయ సైనికుల మృతి పట్ల కూడా సంతాపం తెలిపినట్లు పొంపియో చెప్పారు. సార్వభౌమత్వాన్నికాపాడడానికి భారత్ చేపడుతున్న చర్యలకు అమెరికా ఎప్పుడూ భారత్ కు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి వస్తున్న బెదిరింపులు మాత్రమే కాదు ఇంకా ఎటువంటి బెదిరింపులనైనా ఎదుర్కొనేందుకు భారత్‌, అమెరికా దేశాలు కలిసికట్టుగా సిద్ధంగా ఉన్నాయన్నారు. సైబర్‌, నేవీ రంగాల్లో గత ఏడాది తమ సహకారాన్నిమరింతగా విస్తరించినట్లు పొంపియో వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here