అమరావతి రైతుల ఆగ్రహం… దళితులజోలికివస్తే ఊరుకోము…!

0
78
Amaravathi formers fires on AP Govt.

అగ్గిమీద గుగ్గిలంలా ఉన్న అమరావతి ప్రాంత ప్రజల్ని మళ్ళీ కెలికే పనిలో కొందరున్నారు. పుండు మీద కారం జల్లినట్లు అసలుకే రాజధాని కోసం వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈ వికృత చర్యలతో వారి మానోభావాలు మరింత దెబ్బతింటున్నాయని ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ప్రభుత్వం కావాలని చేస్తుందా? లేక ఎవరు చేస్తున్నారు ? అసలు విషయమేమిటంటే…

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా చెప్తున్న అమరావతి ప్రాంతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధానిలో అంబేద్కర్ స్మృతి వనం కనుమరుగు అవుతుంది. నాలుగు రోజులు క్రితం 5 అంబేద్కర్ విగ్రహాలు మాయం అయ్యాయి. నేడు మళ్ళీ అంబేద్కర్ స్మృతి వనం దగ్గర కాంక్రీటు మిక్సర్లు, షెడ్ లు, కూలర్లు, టేబుల్ లు తొలగిస్తున్నారు కాంట్రాక్ట్ సిబ్బంది. ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థకు నోటీసులు ప్రభుత్వం ఇచ్చిందని దళితులు ఆరోపణలు చేస్తున్నారు.

ప్రభుత్వ నోటీసులతో స్మృతి వనం మొత్తం కాళీ చేస్తున్నారు సిబ్బంది. దీనితో అంబేద్కర్ స్ముతి వనం దగ్గర ఆందోళనకు రాజధాని దళిత సంఘాలు దిగాయి. చివరగా మిగిలిన ఒక అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగిస్తారనే సమాచారంతో అక్కడే ఆందోళనకు దిగిన దళిత సంఘాలు… ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇది పద్ధతి కాదని దళితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here