అమెజాన్ దసరా దీపావళి సంబరాలు

21
Amazon

దసరా  ఆపై దీపావళి వరుసగా పండగల సీసాన్లు  రానున్నాయి . ఈ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2020  అనే పేరుతో భారీ ఆఫర్లను తమ కస్టమర్లకు అందజేస్తుంది.  ఈ భారీ సేల్ అక్టోబర్ 17  న ప్రారంభం అయ్యి  నెలరోజుల పాటు కొనసాగుతుంది.  కొన్ని వందల ఆఫర్లు, డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది. చరిత్రలోనే నెలరోజుల పాటు భారీ డిస్కౌంట్లను అమెజాన్  ప్రకటించడం ఇదే తొలిసారి.  దీపావళిని దృష్టిలో పెట్టుకుని


ఈ సేల్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది.  ఇతర ఈ-కామర్స్ వెబ్‌సైట్లకు అమెజాన్ కు  ధీటుగా 900 కొత్త ప్రాడక్ట్స్‌ను అమెజాన్ పరిచయం చేయబోతుంది. అయితే ఈ ఫెస్టివల్ సీజన్లో  పోటీలో ఉన్న ఇతర ఈ-కామర్స్‌ సంస్థలు చాలా తక్కువ సమయం వరకే  ఈ ఆఫర్లను ప్రకటించడం జరిగింది.  ఎక్కువగా కొనే మొబైల్ ఫోన్లు యాక్ససెరీస్‌లు చాలా తక్కువ ధరకు వస్తున్నాయి.  ఆఫర్లు ,డిస్కౌంట్ల, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్స్ ప్రకటించింది. కొనుగోలు చేసిన వస్తువు డ్యామేజ్ అయితే టోటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను అదనంగా ప్రకటించింది అమెజాన్.  ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్‌పై 70శాతం డిస్కౌంట్లు ప్రకటించింది.

టీవీ మరియు ఇతర ప్రధాన అప్లయన్స్‌ పై వారంటీ పొడగింపు, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది.  ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద రూ.13500 వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది.  బజాజ్ ఫిన్‌సర్వ్ క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డులు ఉంటే నో – కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది.ఎకో స్మార్ట్ స్పీకర్స్ , ఫైర్ టీవీ స్టిక్స్ ,కిండల్స్ పై పెద్ద డిస్కౌంట్లను ప్రకటిస్తోంది అమెజాన్. కిచెన్ అప్లయన్స్‌లపై 60శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది  అదే బట్టలు మరియు యాక్సెసరీస్‌పై 70శాతం డిస్కౌంట్ అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ 2020 అక్టోబర్ 17న ప్రారంభం కానుండగా ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న కస్టమర్లకు 24 గంటల ముందే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here