అమలాపాల్ ప్రియుడు అతడే…!

0
174
Amala Paul ties the knot with boyfriend Bhavninder Singh

హీరోయిన్ అమలాపాల్ గత కొంతకాలంగా ఎవరినో ప్రేమిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీటిపై అమల స్పందిస్తూ ఆ వార్త నిజమేనని అంగీకరించింది. కానీ అతని పేరునిగాని వివరాలనుగాని బయటకు చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ సోషల్ మీడియాకు ఆత్రం అమల బోయి ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందట. ఈ మేరకు కొన్ని ఫోటోలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ లో అమల బుర్కా వేసుకోగా ఆమె వెంట ముంబై సింగర్ భవ్నీందర్‌ సింగ్ ఉన్నాడు. కాగా అమల మాత్రం ఇతని గురించి తెగ పొగిడేస్తుంది. ప్రపంచంలో అందరికన్నా తల్లిమాత్రమే ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతోందని కానీ నా ప్రియుడు మాత్రం నాకోసం తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి తాను కూడాత్యాగం చేయగలనని నిరూపించుకున్నాడు అని తనకి ఈ సినిమా రంగంలో అండగా నిలబడ్డాడు అని చెప్పుకొచ్చింది.

దీనితో నెట్ ప్రేక్షకులు అన్వేషించగా వీళ్లిద్దరి మధ్య కుచ్ కుచ్ హోతాహై అని తేలింది. గతంలో భవ్నీందర్‌ సింగ్‌ కూడా ఆడి ప్రమోషన్ల సమయంలో నా ప్రియురాల్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిఅని చెప్పాడు. ఇక ముందు కూడా ఇలాంటి సినిమాలు చెయ్యి అని ఇన్ స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. తాజాగా అతను షేర్ చేసిన ఒక ఫోటో ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. ఆ ఫొటోలో అతను ఫై నుంచి ఫోటో తీస్తుండంగా ఒక యువతీ ముందు నుంచి అతన్ని హత్తుకుంది. కానీ అందులో అమలాపాల్ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఆమె కచ్చితంగా అమలాపాల్ అని నెట్ ప్రేక్షకులు అంటున్నారు. ఈ మధ్య ఈ ప్రేమజంట బాలి ట్రిప్పుకి కూడా వెళ్లారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here