ఎంతసేపూ అవేనా.. పార్టీ సంగతి ఏంటి మరి …!

0
90
Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు ఆ విధంగా లేవు అని చెప్పాలి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆ పార్టీకి ఇబ్బంది పడుతూ వచ్చింది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నేడు ఈ పరిస్థితుల్లో ఉండటానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ చేసిన తప్పులు చేస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.

క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఆయన పెద్దగా కష్ట పడటం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. వాస్తవానికి సంక్షేమ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో అందడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్న సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు గానీ దాని మీద దృష్టి పెట్టడం లేదు. కేవలం రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న వాటిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దళితులపై జరుగుతున్న దాడులను పదేపదే హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి ని మాత్రమే మాట్లాడుతున్నారు.

గాని క్షేత్రస్థాయిలో కొన్ని వర్గాలకు మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అనే ఆరోపణలు ఉన్నాయి. వాటి పై తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా దృష్టి సారించడం లేదు అని తెలుగుదేశం పార్టీ నేతలే అంటున్నారు. ఎంతసేపు అమరావతి అదేవిధంగా దళితులపై దాడులు మాత్రమే తెలుగుదేశం పార్టీ భుజానికెత్తుకుని నిరసనలు ఆందోళనలు చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇప్పుడు అంతర్వేది వ్యవహారాన్ని తమకు సంబంధం లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు భుజానికెత్తుకుని విమర్శలు చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అసహనం పెరిగిపోతోంది అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here