కరోనా‌ అనంతరం ప్రపంచం ఇలా మారనుంది…

0
125
after coronavirus world changes to like this

మానవాళి ఫై కరోనా ఒక్కసారిగా అనుకోకుండా దూసుకొచ్చింది. ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నారంటే దీని ప్రభావం ఎలావుందో అర్ధం చేసుకోవాలి. దీనివలన ఒకటి కాదు రెండు కాదు యావత్ ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా నష్టపోయాయి. అయితే ఎన్ని పరిశోధనలు చేసిన దీనికి మందును మాత్రం ఇంతవరకు కనుగొనలేకపోయారు. దీనితో కలిసి బ్రతకడం తప్ప చేసేదేమిలేదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా మరింత విజృంభించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పా కరోనాని  అరికట్టలేము ఈ మేరకు లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత కొన్ని దేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చూద్దాం. ఈ  లాక్ డౌన్ కారణంగా మహిళలు బాగా మిస్ అవుతుంది   బ్యూటీ పార్లర్లు. జపాన్ లోని టోక్యోలో ఈ సెలూన్ల షాప్ నిర్వాహకులు, కస్టమర్ లు తప్పనిసరిగా మాస్కులు వాడుతున్నారు.

అంతకు ముందు ఆదాయం కంటే ఇప్పుడు ఆ షాపుల వాళ్ళ ఆదాయం  బాగా తగ్గింది. ఇక పెళ్లి వ్యవహారాలకు వస్తే స్పెయిన్ దేశంలో అయితే పెళ్ళికి రెడీ అవుతున్న ఒక అమ్మాయికి తన దుస్తులు సరిచేయడం, తనను రెడీ చేయడం అన్ని తన స్నేహితురాలు సహాయం చేస్తుంది. జిమ్ ల విషయానికి వస్తే జిమ్ లో ప్రజలు మాస్కులు ధరించి దూరం దూరం గా ఉంటూ వ్యాయామం చేస్తున్నారు. ఇది సెర్బియా లో చోటు చేసుకుంది. ఇక రెస్టారెంట్ల విషయానికొస్తే బ్యాంకాక్ లోని ఓ రెస్టారెంట్ వాళ్ళు ఒక టేబుల్ కి మధ్యలో గాజు గ్లాస్ ఏర్పాటు చేసి సామజిక దూరం పాటిస్తూ భోజనం అందిస్తున్నారు. ఇంకా బ్యాంకాక్‌లోషాపింగ్ మాల్స్, పార్కులు, బార్, వైన్ షాపులు తెరుచుకోగా ఎరావాన్‌ మందిరంలో ప్రదర్శకులు ముఖానికి రక్షణ కవచాలు ధరించి ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక ఆసుపత్రుల విషయానికి వస్తే స్పెయిన్ లోని ఆసుపత్రికి వచ్చిన పేషంట్లకు ముఖానికి మాస్కును ఉంచి వైద్యం అందిస్తున్నారు. కొన్ని అత్యవసర సందర్భాలలో మాత్రమే ముసుగును తొలగించి చికిత్స చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here