అడ్రస్ మార్చుకున్న ఇల్లు.

15
house.by mirchipataka

ఇల్లు మారి కొత్త ఇంట్లోకి వెళ్లినప్పుడు.. ఇంటి అడ్రస్‌ మారిపోయింది అంటాం. మరి ఇల్లే ఉంటున్న అడ్రస్ నుండి వేరే అడ్రస్ కు వెళ్ళిపోతే!. నిజంగా జరిగిన ఈ సంఘటన కు సంబందించిన వీడియో వైరల్‌గా మారింది.  పురాతన విక్టోరియన్‌ భవంతిని 139 ఏళ్ల క్రిందట కట్టారు. నాటి నుంచి ‘807, ఫ్రాంక్లిన్‌ స్ట్రీట్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో’ అనే చోట స్థిరంగా ఉంది. కాగా, కొన్ని కారణాల మూలంగా ఈ ఆదివారం అదే ప్రాంతంలో ఆరు వీధుల అవతలకు వెళ్లి చేరింది. ఆరు బెడ్రూములు, పెద్ద పెద్ద కిటీకీలు కలిగి చక్కటి ముఖ ద్వారం ఉన్న ఈ  రెండంతస్తుల అందమైన ఇంటిని తరలించేందుకు ఆ ఇంటి యజమాని టిమ్‌ బ్రౌన్‌ కు సుమారు మూడు కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యిందట. ఐతే ఈ ఇంటిని తరలించటం అంత తేలికగా జరగలేదని ఇళ్లను తరలించడంలో ఎంతో అనుభవం కలిగిన ఫిల్‌ రాయ్‌ తెలిపారు. ఇందుకు వారు ఏళ్ల తరబడి ప్లాన్ చేసుకోవాల్సి వచ్చిందట. పదిహేను ప్రభుత్వ, నగర పాలక సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి వచ్చిందట. పార్కింగ్‌ స్థలాలు, చెట్ల కొమ్మలు, ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఇలాంటి ఆటంకాలన్నీ తాత్కాలికంగా తొలగించాల్సి వచ్చిందట. ట్రాలీపై గంటకు ఒక మైలు వేగంతో ప్రయాణించారట. కాగా, మార్గమధ్యంలో కాస్త పల్లంగా ఉన్న చోట్లలో ఇల్లు ఎక్కడ పడిపోతుందేమోనని  కాస్త టెన్షన్‌ కూడా పడ్డామని ఫిల్‌ తెలిపారు. అదృష్టవశాత్తూ ఏ ఆటంకం కలగకుండా ఈ కార్యక్రమం సజావుగా జరిగిందని ఆయన అన్నాడు. భారీ ట్రాలీపై తరలి వెళ్లున్న ఆ ఇంటిని చూడడానికి అక్కడి ప్రజలు బారులు తీరారు. ‘అడ్రస్‌ మారుతున్న ఇంటి’తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here