యాక్షన్…కామెడీ…త్రిల్లర్…లవ్.. అన్ని రకాల సినిమాలు ఒకే రోజు..!!

265
Movies on 22nd November

సంవత్సరం చివరిదశకు చేరుకుంటున్న సమయంలో టాలీవుడ్ లో సినిమాల సందడి హోరెత్తుతోంది. నవంబర్ 22 న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. అవన్నీ చిన్న సినిమాలే అవ్వడం విశేషం. ప్రేక్షకులకి చిన్న సినిమాలే అయినప్పటికీ నిర్మాతలకు మాత్రం పెద్ద సినిమాలే కదా! వివరాల్లోకి వెళ్తే..ఈ ఆరు సినిమాల్లో కూడా ముఖ్యంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రాలు..జార్జ్ రెడ్డి, ఫ్రోజెన్-2.

నిన్న మొన్నటి వరకు కూడా జార్జి రెడ్డి ఎవరో తెలియని వారు కూడా “జార్జ్ రెడ్డి” అనే సినిమా పేరు వినబడగానే ఈ మధ్య నెట్లో వెతకడం మొదలు పెట్టారు. కొంతమందికి తెలిసినప్పటికీ.. చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జార్జ్ రెడ్డి అనే అతను ఉస్మానియా యూనివర్సిటీ లో ఒక ఉద్యమ నాయకుడు. అంతే కాక అతను ఒక గోల్డ్ మెడల్ స్టూడెంట్. అన్యాయాన్ని సహించలేనటువంటి వ్యక్తి. న్యాయం కోసం పోరాడే వ్యక్తి. అతన్ని ఎవరు చంపారు? అతను స్టూడెంట్స్ లో పోరాట స్ఫూర్తిని ఎలా తీసుకొచ్చాడు? అని తెర మీద చూడాల్సిందే..! ఈ సినిమా ఒక వ్యక్తి నిజ జీవిత గాద కావడం చేత మరియు ఈ సినిమాని అప్పట్లో పవన్ కళ్యాణ్ తీద్దామని అనుకున్నాడట. ఇలాంటి అనేక కారణాల చేత సినీ ప్రేక్షకులు ఆ సినిమా పై ఒక కన్నేశారు. ఈ చిత్రం రేపు నవంబర్ 22 న రిలీజ్ కాబోతుంది.

sitaraఫ్రోజెన్-2 అనే ఒక హాలీవుడ్ చిత్రం కూడా రేపే రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం లో ప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టి అయిన తన కూతురు సితార దుబ్బింగ్ చెప్పడం విశేషం. సినీ లవర్స్ మరియు మహేష్ బాబు ఫాన్స్ ఈ సినిమా పై అంచనాలు పెట్టుకున్నారు.

raagala 24 gantalaloఇషా హెబ్బా,సత్య రాజ్ నటించిన ఆక్షన్ అండ్ త్రిల్లర్ మూవీ “రాగాల 24 గంటలలో ” అనే చిత్రం కూడా రేపే రిలీజ్ కు నోచుకుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఇటు లక్ ని పరీక్షించుకోనుంది. మరియు ఇదే తరహాలో.. అంటే త్రిల్లర్ అండ్ రొమాంటిక్ నేపథ్యంలోనే “బీచ్ రోడ్డులో చేతన్” అనే చిత్రం కూడా రిలీజ్ అవుతుంది. ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కొత్తగా చేస్తున్నారు. ప్రేక్షకులని సినిమా వైపు తిప్పుకునేలా చేస్తున్నారు.

వీటితో పాటు రాజేంద్ర ప్రసాద్ నటించిన “తోలుబొమ్మలాట”, జ్యోతిక రీ ఎంట్రీ ఇచ్చిన “జోక్ పాట్” చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. సినీ ప్రేక్షకులకు ఒక రకముగా పండగనే చెప్పుకోవాలి. ఏ జోనర్ సినిమాకి వెళ్లాలనుకునే వారు ఆ సినిమాకి వెళ్లొచ్చు. కాకపొతే ఏ సినిమాకి కలెక్షన్లు రాకపోవచ్చు. కానీ చిన్న చిన్న సినిమాలు కావడంతో నిర్మాతలకి ముప్పేమీ ఉండకపోవచ్చు అనే చెప్పుకోవాలి.

మరి చూద్దాం ఏ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల మన్ననలు పొందుతుందో!? నవంబర్ 22 న విడుదల కాబోయే ఈ చిత్రాలకు మన మిర్చిపటాకా నుండి ఆల్ ది బెస్ట్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here