ట్రెండింగ్‌లో ఏఏ21..!!

25
Allu Arjun New Movie

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లైన్ గా  సినిమాలు చూస్తూ దూకుకెళ్తున్నారు. స్టార్ దర్శకులతో సినిమాలు ఓకే చేసి మంచి లైనప్‌ని కనబరుస్తున్నారు. అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో  పాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప సినిమాని  తెరకెక్కిస్తున్నారు. ఇందులో లక్కీ బ్యూటీ రష్మిక మందాన హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివతో చేయనున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా మిర్చితో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన దర్శకుడు కొరటాల శివ. కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమా పొలిటికల్ డ్రామాలో తెరకెక్కనుందన్న వార్తలు ఇప్పటికే చాలా వినిపిస్తున్నాయి. తాజాగా ఏఏ21 సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇటీవలే ప్రారంభించారంట.  ఈ సినిమాని  వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామంటూ మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో వెయిట్ చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here