“90ML” Movie Review..

1254
90ML Movie Review


Release Date: December 06, 2019

MirchiPataka Rating: 2.5/5
న‌టీన‌టులు: కార్తికేయ‌, నేహా సోలంకి, ర‌వికిష‌న్‌, రావు ర‌మేష్‌, అజయ్ , ఆలీ , ప్ర‌గ‌తి, ప్ర‌వీణ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, అదుర్స్ ర‌ఘు, స‌త్య ప్ర‌కాష్‌, రోల్ రిడా, నెల్లూర్ సుద‌ర్శ‌న్‌, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులు
సంగీతం: అనూప్ రూబెన్స్
బ్యాన‌ర్‌: కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్‌
కెమెరా: జె.యువ‌రాజ్‌
ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌
పాట‌లు: చంద్ర‌బోస్‌
నిర్మాత : అశోక్‌రెడ్డి గుమ్మకొండ
రచన-దర్శకత్వం : శేఖర్ రెడ్డి ఎర్ర

Rx 100 సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో కార్తికేయ ఇదే ఏడాది మూడో సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు చిత్ర బృందం. Rx 100 సినిమాని నిర్మించిన వారే ఈ సినిమా నిర్మాణంలో భాగం అవ్వడంతో ఆసక్తి పెరిగింది.

మరి కదా కధానాల్లోకి వెళ్తే హీరోకి చిన్నప్పటినుండి ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య కారణంగా రోజుకి కొంత మద్యం తాగాల్సిన పరిస్థితి. అయితే దీనికి పూర్తి బిన్నంగా మద్యం అంటేనే పడని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోఇన్(నేహా సోలంకి) తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆ విషయం తెలిసిన హీరో ఇన్ తన నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? అతనికి ఉన్న ఆ మద్యం సమస్య చివరికి ఎలా దారి తీసింది? అనేది స్క్రీన్ మీదే చూడాల్సి ఉంటుంది.

దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర సినిమా ని కొత్తగా డిఫరెంట్ గా తీద్దామని అనుకున్నప్పటికీ.. అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా లనే ఉంది. నిర్మాణ విలువలు బానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాస్త మైనస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలు సీన్లలో కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటే ఆ సీన్ రేంజ్ మారి వేరేలా ఉంటుంది. కానీ ఈ సినిమా లో అది లోపించిందనే చెప్పాలి.

కామెడీ పర్వాలేదనిపించింది. కొన్ని కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కధకి అంతగా సెట్ అవ్వలేదు అనిపించుకునేలా ఉన్నాయి. హీరో హీరోయిన్ల మధ్య లవ్ సీన్స్ బానే ఉన్నాయి. యాక్టింగ్ పరంగా అందరు బానే చేసారు. ఓవరాల్ గా సినిమా పర్లేదు అనిపిస్తుంది. కానీ ప్రేక్షకులు కార్తికేయ నుండి రెగ్యులర్ గా కాకుండా కాస్త డిఫెరెంట్ గా ఉండే సినిమాలను ఆశిస్తున్నారని అర్ధమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here