చరిత్ర లో క్రికెట్ అభిమానులకు మరుపు రాని రోజు..!

0
127
9 years of India's 2011 World Cup win

2011 ఏప్రిల్ 2 భారతీయ క్రికెట్ అభిమానులకు మరపు రాని రోజు మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచింది. అప్పటిలో ప్రపంచ కప్ కి 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ… ఈ చరిత్రత్మక ఘట్టం జరిగి సర్రిగ్గా ఈరోజు కి 9 ఏళ్ళు గడిచింది. ఈ సంఘటన క్రికెట్ అభిమానులకు గొప్ప అనుభూతి ని మిగిల్చింది. శ్రీలంక తో అత్యంత రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసి ఆనంద సాగరాల్లో ముంచేసింది.

ఆ చరిత్రత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు అవకాశం రానే వచ్చింది 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ గురువారం పునఃప్రసారం చేయనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక బాటింగ్ ని ఎంచుకుంది. 50 ఓవర్ లకు 6 వికెట్ల నష్టంతో 274 రన్స్ చేసింది ప్టెన్ మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13×4) అజేయ సెంచరీ చేసాడు.

లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ఆదిలోనే కోల్పోయింది. విరాట్ కోహ్లీ (35) కాసేపు నిలబడ్డాడు. గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9×4)తో కలిసి ధోనీ (91 నాటౌట్: 79 బంతుల్లో 8×4, 2×6) నాలుగో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గంభీర్ ఔటైనా.. యువరాజ్ సింగ్‌తో కలిసి 48.2 ఓవర్లలోనే 277/4 తో మ్యాచ్‌ని ధోనీ ముగించాడు.

కెప్టెన్ ధోనికి ఇది ఒక రికార్డు. వీటితో పాటు 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here