75 % కేసుల్లో కరోనా లక్షణాలు లేవు : కేజ్రీవాల్

0
111

దేశంలో లక్షణాలు కనిపించకుండానే కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజా గ ఢిల్లీ లో నమోదు అయినా 75 % కేసుల్లో లక్షణాలు కనిపించడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వివరించారు.  కాగా కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని , ఇలాంటి వారికీ ఇంటి దగ్గరే చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

అంతేకాదు ప్రైవేట్ అంబులెన్సు లకు కూడా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ నుంచి వలస కార్మికులు కాలినడకన వెళ్లోద్దని వారందరికీ ప్రత్యేక రైళ్లల్లో సొంతఊళ్ళకు చేరుస్తామని విజ్ఞప్తి చేసారు. ఢిల్లీ లో మొత్తం 6 వేలకు పైగా కేసులు ఉండగా, 70 మంది కి పైగా మృత్యువాత పడ్డారు.

దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 4200 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో వైరస్ బయటపడినప్పటి నుంచి ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 67152 కేసులు నమోదు కాగా 2000 లకు పైగా మృత్యువాత పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here