

తెలంగాణలో రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కాబోతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.రేపటి నుండి మార్చి 1 వ తేదీ వరకు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవచ్చని ఆమె మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన ఆమె కోవిడ్ మార్గదర్శక సూత్రాలని తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.కోవిడ్ కారణంగా గత ఏడాది మార్చి చివరి నుంచి విద్యాలయాలు మూతపడ్డాయి. సుదీర్ఘకాలం తర్వాత కాలేజీలు ప్రారంభమైనప్పటికీ పాఠశాలలు మాత్రం తెరుచుకోలేదు. తెలంగాణలో 9, 10 వ తరగతులు కొనసాగుతున్నాయి.
ఈ నేపధ్యంలో మిగతా తరగతులు చదువుకునే విద్యార్థులకు బడులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తాజాగా 6, 7, 8 తరగతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.