అధిక రక్తపోటు తగ్గించడానికి 3 మూలికలు..

25
3-herbs-to-reduce-high-blood-pressure

అధిక రక్తపోటు గత కొన్నేండ్లుగా అంటువ్యాధిగా మారింది. 140/90 కంటే ఎక్కువ రక్తపోటుతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. రక్తపోటు సమస్య చాలా ప్రమాదకరమైనది.దీని మూలంగా శరీరంలోని ఇతర అవయవ వ్యవస్థలు ప్రభావితమవుతాయి. చివరికు అధిక రక్తపోటు గుండె సమస్యలు, స్ట్రోక్‌, మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారి తీస్తుంది. నిజానికి అధిక బీపీకి లక్షణాలు కనిపించవు. అందువల్ల దీనిని చాలా కాలం వరకు కనిపెట్టలేరు. ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పకుండా వ్యాయామం ఇలాంటి వాటి ద్వారా హైబీపీకి చెక్ పెట్టవచ్చు.అధిక రక్తపోటుకు చెక్మ పెట్టడానికి మరొక మార్గం ఉంది. అదే ఆయుర్వేద శక్తి. రక్తపోటును తగ్గించడానికి అద్భుతమైన కొన్ని మూలికలు ఉన్నాయి. బీపీ సమస్యను తగ్గించడానికి తోడ్పడే 3 మూలికల గురించి తెలుసుకుందాం. తులసి.. రక్తపోటును తగ్గించడంలో ఈ మూలిక ఎంతో సహకరిస్తుంది. తీపి తులసిలోని సహజమైన కాల్షియం బ్లాకర్‌గా పనిచేసి రక్తపోటును నివారిస్తుంది. రక్త నాళాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే గుండెలోకి కాల్షియం కదలికకు అడ్డుకట్ట వేస్తుంది. తులసి ఆకులు రోజు తినడం వలన గుండెకు చాలామంచిది. రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. తులసి, తేనె రెండింటిలోనూ యాంటీ సెప్టిక్‌ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే చర్మ సమస్యలు కూడా ధరి చేరవు.

పార్స్లీ..
ఈ మూలిక అమెరికన్, యూరోపియన్ దేశాల వంటకాల్లో ప్రసిద్ది పొందింది. ఆహారంలో ఎక్కువ రుచినిఅందించడమే కాకుండా రక్తపోటును తగ్గించడంలో సహాయపడే విటమిన్ సీ, డైటరీ కెరోటినాయిడ్లు వంటి ఇతర సమ్మేళనాలు కూడా ఇది కలిగి ఉంది. గుండె జబ్బుల వెనుక పెద్ద కారణం అయిన చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది.

వెల్లుల్లి..
ఇది అన్ని ఇండ్లలోని వంటగదుల్లో సులభంగా లభిస్తుంది. రక్తపోటు నివారణ విషయంలో ఎంతో సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ వంటి అనేక సల్ఫర్ సమ్మేళనాలు రక్త ప్రవాహాన్ని పెంచడంలో మరియు రక్త నాళాలను సడలించడానికి సహకరిస్తాయి. ఈ కారణాల తో రక్తపోటు తగ్గుతుంది. 600 నుంచి 1,500 మి.గ్రా వెల్లుల్లి సారం రక్తపోటును నివారించడంలో అటెనోలోల్ ఔషధం వలె పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here