తెలంగాణాని కలవరపెడుతున్న కరోనా..!

0
183
20 positive cases reported in Telangana

తెలంగాణను కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటి వరకూ ధైర్యంగా ఉన్న యంత్రాంగం కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏ పరిస్థితులు ఎటువైపు తీసుకు వెళ్తాయో అనే ఒకటే భయం. రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణలో మళ్లీ ఒక పాజిటివ్ కేసులు నమోదు కాగా దీంతో కరీనా బాధితుల సంఖ్య 20కు చేరింది. 20 మందిలో 11 మంది విదేశీయులు కాగా మిగిలిన వారు మన దేశానికి చెందినవారు. దీంతో తెలంగాణ మొత్తం దడ మొదలైంది. దీనితో ఒక తెలంగాణనే కాక అటు ఏపీలో కూడా అనేక స్థాయిని టేషన్ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు.

ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినటువంటి జనతా కర్ఫ్యూ కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. రేపు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. కరోనా వైరస్ ని అరికట్టడం అనేది కేవలం ప్రభుత్వాలు మరియు వైద్యుల యొక్క బాధ్యతే కాదని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. దీనికి ప్రజలందరూ సహకరిస్తేనే దీనిపై విజయం సాధించవచ్చని అన్నారు. అయితే నగర శివార్లలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలో వీటన్నిటినీ పూర్తిగా ఐసోలేషన్ కి ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. దాని కోసం తగిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here