హీరో నిఖిల్ పెళ్లి

0
126

యువ కథానాయకుడు నిఖిల్ వివాహం ఈరోజు ఉదయం తాను ప్రేమించిన పల్లవి తో జరిగింది. శామీర్ పేటలోని ఒక ప్రైవేట్ అతిధి గృహంలో అత్యంత సన్నిహితుల మధ్య నిఖిత్, పల్లవి వర్మల వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం, శాస్త్రోక్తంగా జరిగింది. ఎంతో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని నిఖిల్ ఆశపడ్డాడు కానీ కరోనా వైరస్ కారణంగా అతి తక్కువ మంది వేడుకకు హాజరు అయ్యారు.

ఇది వరకే వీరి ఎంగేజ్మెంట్ జరుగగా, పెళ్లి ఏప్రిల్ 16 న జరగాల్సి ఉంది కానీ కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యములో లాక్ డౌన్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని నిఖిల్ తెలిపాడు కానీ వీరి జాతక రీత్యా ముహార్తాలు లేకపోవడంతో ఈరోజు (మే 14న) ఉదయం 6 :31 నిమిషాలకు పెద్దలు నిశ్చయించిన సుముహార్తానికి నిఖిల్, పల్లవి వర్మ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి మొదటి వారంలో గోవాలో కొందరు సన్నిహితుల మధ్య ఎంగేజ్ మెంట్ జరిగింది.

శామిర్ పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో అత్యంత సన్నిహితుల మధ్య భౌతిక దూరం (సోషల్ డిస్టాన్సింగ్) పాటిస్తూ నిఖిల్, పల్లవి వర్మ వివాహం చేసుకున్నారు. కాగా, హ్యాపీడేస్, స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో నిఖిల్ విజయాలు అందుకున్నాడు. నిఖిల్ కెరీర్ ప్రస్తుతం సజావుగా సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here