సాయంత్రం 4 గంటలకు 20 లక్షల ప్యాకేజీ వివరాలు

0
105

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోడీ 20 లక్షల ఆర్థిక ప్యాకేజీ ని ప్రకటించారు. ఈ ప్యాకేజీకి సంబందించిన పూర్తి వివరాలను ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిర్మల సీతారామన్ మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.

ఆర్థిక వ్యవస్థను గాడి లో పెట్టేందుకు కేంద్రప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీను ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. ప్యాకేజీ స్వరూపం ఎలా ఉంటుంది అనే దానిపై పారిశ్రామిక వర్గాలు తీవ్ర ఉత్కంఠత తో ఎదురుచూస్తున్నాయి. ఆధునిక సాంకేతికతను బలోపేతం చేయాలన్న ప్రతిపాదకతతో ఈ ప్యాకేజీ లో మార్కెట్ కి సంబంధించి అంశాలు ఉండొచ్చని అందరు భావిస్తున్నారు.

ప్రధాని ప్రకటించిన ప్యాకేజీ లో బ్యాంకులకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలని , బ్యాంకులను రక్షించుకుంటేనే ఆర్థిక రంగం బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా సంక్షోభంలో నిరుపేదలు ,కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేదలు ,శ్రామికులు ,సంఘటిత ,అసంఘటిత రంగంలో ఉన్నవారికోసం ఇలాంటి ప్యాకేజీలను ప్రకటించినట్లు మోడీ అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here