రానా పెళ్లి మిహిక బజాజ్ తో

0
103

టాలీవుడ్ కథానాయకుడు రానా పెళ్లి టాపిక్ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా తాను ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసాడు. మిహిక కూడా అంగీకారం తెలిపింది అని ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫోటో కూడా పోస్ట్ చేసాడు రానా.

మిహిక ముంబై లో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నిర్వహిస్తుంది. తాను పుట్టి పెరిగింది అంత హైద్రాబాదులోనే అని సమాచారం. ముంబై ,లండన్ లలో ఎడ్యుకేషన్ ని పూర్తి చేసుకుంది. డ్యూ డ్రాప్ స్టూడియో పేరుతో తాను కార్యాలకలాపాలు నిర్వహిస్తుంది. మిహిక ,రానా కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నారని సమాచారం. మిహిక తల్లి బంటి బజాజ్ ప్రముఖ జువెలర్ డిజైనర్.

రానా తనకు కాబోయే భార్యను పోస్ట్ ద్వారా తెలియజేయగానే కొందరు సినిమా వాళ్ళు విషెస్ కూడా తెలిపారు. త్వరలోనే వీరి పెళ్లి అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. రానా నటించిన అరణ్య మూవీ విడుదల కాబోతుంది. ప్రస్తుతం విరాటపర్వం లో నటిస్తున్నాడు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here