మహేష్‌ నాకు బిగ్ బ్రదర్.. బాలీవుడ్ హీరో రన్ వీర్.

57

దేశ మొత్తం మీద మహేష్‌కు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు టీవీ యాడ్స్  పై కూడా దృష్టి పెట్టాడు. మహేష్ ఇప్పటికే అనేకరకాల బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ఫేమస్ కూల్‌డ్రింక్ థమ్స్‌అప్‌కి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే థమ్స్ అప్‌కు హిందీలో రన్ వీర్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక యాడ్ చేసారు. దీనిగురించి రన్ వీర్ తన ఇస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దానికి మహేష్ తో కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా జతపరిచాడు. మహేష్ ఒక జెంటిల్‌మ్యాన్ ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.బిగ్ బ్రదర్‌తో మరోసారి కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉంది. అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అయితే వీరిద్దరు ప్రస్తుతం ముంబైలో షూటింగ్ చేస్తుండగా వీరిద్దరూ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు గనుక నిజమే ఐతే అభిమానుల ఆనందానికి అంతం ఉండదు. మహేష్ స్టైల్, రన్ వీర్ ఎనర్జీ తోడైతే ఆ సినిమా ఓ రేంజ్‌లో ఉండదని అర్ధం అవుతుంది. మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుందేమో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here