మహిళా వివాహ వయస్సు పెంపు

0
95

మహిళల కనీస వివాహ వయస్సు పెంచడంపై కేంద్ర ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది . మహిళలు ఏ వయస్సు లో గర్భం దాల్చాలో అన్న విషయంపై అధ్యయనం చేయడానికి కార్య దళాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ

శనివారం జారీ చేసిన పత్రిక ప్రకటన ఇందుకు ఊతమిస్తుంది .

మహిళల వివాహ వయస్సు ప్రస్తుతం 18 సంత్సరాలు కాగా ,దీన్ని ఎంతకు పెంచాలనేదానిపై అధ్యయనం చేయనున్నారు .ఢిల్లీ కి చెందిన జయ జైట్లీ అధ్యక్షురాలుగా ఈ కార్యదళం ఏర్పాటయింది . ఈ కార్యదళం జులై 31 కల్లా నివేదిక ఇవ్వనుంది .గత బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేసిన ప్రకటనకు అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేసారు శారదా చట్టం -1929 లోని నిబంధలను సవరించి 1978 లో మహిళల వివాహ వయస్సును 15 నుండి 18 ఏళ్లకు పెంచారు

అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్ ఎంతో పురోగమించింది .మహిళలు ఉన్నత విద్య ను అభ్యసించి ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here