భోపాల్ గ్యాస్ ఘటన 1984 – ఇప్పుడు కరోనా

0
113

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో 1984 లో UCIL పురుగుల మందు ప్లాంట్ లో మిథైల్ వాయువు లీక్ కొన్ని వేల మంది మరణించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక విపత్తు చాలా మంది ఆ రోజు గ్యాస్ లీకేజి వల్ల దీర్ఘ కాల వ్యాధులకు గురి అయ్యారు. వారంతా ఈరోజు కూడా వ్యాధులతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

అలాంటి వారిపై ఇప్పుడు కరోనా దెబ్బ కూడా పడింది. తాజా మరణాల్లో ఎక్కువ భాగం ఇలాంటివే భోపాల్ లో కరోనా తో 19 మంది చనిపోతే అందులో 17 భోపాల్ ఘటన బాధితులే అని భోపాల్ గ్రూప్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆక్షన్ అనే స్వచ్చంద సంస్థ చెబుతోంది. దింతో గ్యాస్ బాధితులందరికీ కరోనా ప్రాథమిక పరీక్షలు జరిపించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.  భోపాల్బాధి ప్రత్యేక కరోనా హాస్పిటల్ ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. భోపాల్ గ్యాస్ లీక్ ఘటనకు గురి అయిన బాధితులకు శ్వాసకోశ వ్యాధులు ,మధుమేహం , క్యాన్సర్ ,క్షయ వంటివి ఉన్నాయి. దింతో వీరిపై కరోనా ప్రభావం చాలా త్వరగా పడింది అందుకే మధ్యప్రదేశ్ లో ఎక్కువ కరోనా మరణాల్లో భోపాల్ బాధితులే ఉన్నారని సంస్థ చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here