బంకర్లోకి వెళ్లిన ట్రంప్

0
106

అమెరికా పోలిసుల కారణంగా ఆఫ్రో అమెరికన్ వ్యక్తి జార్జి ప్లాయిడ్ మరణించిన నేపథ్యంలో తీవ్ర ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి . ఈ పరిణామం ఏకంగా వైట్ హౌస్ చుట్టు ముట్టింది .అయన తన కుటుంబంతో సహా శ్వేతా సౌధంలోని బంకర్లో తల దాచుకునే పరిస్థితి ఏర్పడింది

అధ్యక్ష భవనానికి దగ్గర్లో దాడులకు పాల్పడుతున్న నిరసన కారులను చెదర గొట్టడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు .
అప్పటికే నిరసనకారులు అధ్యక్ష భవనం యొక్క అద్దాలు పగలగొట్టి , కొన్ని వాహనాలకు నిప్పు కూడా అంటించారు . ట్రంప్ కి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి . ట్రంప్ సోమవారం అంత బయటికి రాలేదు .

రాజకీయ లక్ష్యాల సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగే స్వతంత్ర కార్యకర్త బృందాలున్న ‘ఆంటీఫా ‘ ఉగ్రవాద సంస్థ గ పరిగణిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు అమెరికా లో తాజా పరిణామాలు రాజకీయంగా వేడిక్కిస్తున్నాయి .ట్రంప్ ప్రత్యర్థులు దీన్ని రాజకీయంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు .ఈ అల్లర్లలో అరెస్ట్ అయినా వారు నాలుగు వేల వరకు , ప్రాణాలు కోల్పోయింది ఐదుగురు గ నమోదు అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here