

రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తో పాటు గా కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా లో బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ . ఈ సినిమా చిత్రీకరణ కోసం తోలి దశకు చేరకుంటున్న సమయం లో ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టనున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో కేజీయఫ్ డైరెక్టర్‌తో మరో సినిమా చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో ఓ యంగ్ డైరెక్టర్ తన స్క్రిప్ట్‌ని తారక్‌కి వినిపించి ఒప్పించుకున్నాడనే వార్త చక్కర్లు కొడ్తుంది. ఈ సంవత్సరం హిట్ సినిమా తో సక్సెస్ కొట్టిన డైరెక్టర్ శైలేష్ కొలను రీసెంట్గా దిల్ రాజు కు ఓ స్క్రిప్ట్ వివరించాడు. స్టోరీ తారక్‌కి బాగా నచ్చడం తో స్క్రిప్ట్ రెడీ చేయమని వివరించాడట . ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ డిలే అయిపోయాక ఈ గ్యాప్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే తారక్ ప్లానింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.