ఫాస్టాగ్ లేదా..??? డబుల్ టోల్ ఛార్జి తో వాహనదారులకు ఇంకో షాక్…

31
FastTag

ఫిబ్రవరి 15,2021 అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ నిబంధనలు అమలులోకి వచ్చింది . వాహనాలకు ఫాస్ట్ టాగ్ లేకుండా ఉంటె ఎన్.హెచ్.ఏ.ఐ టోల్ గేట్ల వద్ద డబుల్ టోల్ చార్జీ వాసులు చేయనున్నారు. ఫాస్టాగ్ లేకుండా ఉంటె ఫైన్ వేస్తారు, ఫాస్టాగ్ లేకుండా ఉంటె డబుల్ టోల్ చార్జి వాసులు చెయ్యడమే కాదు జరిమానా కూడా విధిస్తారు.

ఫాస్టాగ్ లేకపోవడం అంటే మోటార్ వాహన చట్టాలను నిబంధనలను ఉల్లంఘన చేసినట్లు అవుతుంది అని ఆర్టీఏ అధికారులు తెలిజేశారు. తొలిసారి రూ.300, రెండోసారి రూ.500 ఫైన్ ను విధించనున్నట్లు తెలిజేశారు.

అయితే మీరు కచ్చితంగా హైవే ల మీద వెళ్లేటప్పుడు ఫాస్టాగ్స్ ‌ను పెట్టుకోడం అవసరం . ఎందుకంటే ఇకపై టోల్ ప్లాజాల దగ్గర క్యాష్ తీసుకోరు. ఆటోమేటిక్‌గానే ఫాస్టాగ్ నుంచి టోల్ ప్లాజా చార్జీలు కట్ అవుతాయి. టోల్ ప్లాజాల ద్వారా వెళ్లే అన్ని వాహనాలకు ఇది వర్తిస్తుంది.

టోల్ ప్లాజాల వద్ద వాహనాలు చాలా సమయం వరకు వేచి చూసే అవకాశం లేకుండా అనగా టైమ్ వేస్ట్ అవ్వకుండా , భారీ రద్దీని తొలగించడానికి , సులభమైన చెల్లింపులు చెయ్యడానికి తీసుకొచ్చిన విధానమే ఫాస్టాగ్. బార్ కోడ్ మోడల్ లో ఓ ఎలక్ట్రానిక్ స్టిక్కర్ నే ఫాస్టాగ్ అని అంటారు . ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ ప్లాజాల దగ్గర రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here