త్వరలనే ప్రజలకు తీపి కబురు చెప్తా : కే సి ఆర్

0
95

కొండపోచమ్మ జలాశయం వద్ద మర్కుక్ పుంపు హౌస్ ప్రారంభించిన తర్వాత కే సి ఆర్ మీడియా తో మాట్లాడారు .రాష్ట్ర భవిష్యత్తులో ఇది ఒక ఉజ్వలమైన ఘట్టంగా కే సి ఆర్ వర్ణించారు .ప్రాజెక్ట్ లో భాగంగా భూములు కోల్పోయిన వారి త్యాగాలు వెలకట్టలేనివి అన్నారు .భూమి కోల్పోయిన వారికీ న్యాయం చేస్తామని అన్నారు .

తెలంగాణ రైతులు లక్ష కోట్ల రూపాయల విలువైన పంటలు పండిస్తున్నారని , పసిడి పంటల దిశగా రాష్ట్రము ముందుకు వెళ్తుందని అన్నారు .యావత్ ప్రపంచం అబ్బురపడే ప్రాజెక్ట్ కాళేశ్వరం. మల్లన్న సాగర్ రాష్ట్రము లో రెండో అతి పెద్ద ప్రాజెక్ట్ .తెలంగాణ ఇంజనీర్స్ ప్రతిభకే నిదర్శనం ఈ ప్రాజెక్ట్స్ అని అన్నారు .

తక్కువ కాలంలో ఆశించిన ప్రగతి సాధించాం .ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బందు పథకాల్ని కూడా అమలు చేస్తున్నాం .24 గంటల కరెంటు ను అందిస్తున్నాం .తెలంగాణ ప్రజలకు త్వరలోనే ఒక తీపి కబురు చెప్తానని ,అది దేశం ఆశర్యపోయేలా ఉంటుందని కే సి ఆర్ అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here