గ్రీన్‌ టీ సేవించే సమయం ఎప్పుడో తెలుసా

75
green tea side effects

గ్రీన్‌ టీ తాగడం వల్ల అన్నీ ఉపయోగాలే కానీ, నష్టాలు రావనుకుంటారు చాలామంది. నిజానికి దాన్ని తాగాల్సిన రీతిలో తాగకపోతే నష్టాలు కూడా అనుభవించాల్సి రావచ్చు. గ్రీన్‌ టీని ఎప్పుడు పడితే అప్పుడు సేవించకూడదు. భోజనం తరువాత పొట్ట నిండుగా ఉన్నపుడు గ్రీన్‌ టీని తీసుకోవద్దు. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియకు అడ్డు పడవచ్చు. బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా గ్రీన్‌ టీని సేవించకూడదు. అధిక ఆరోగ్య లాభాలు సమకూరాలంటే గోరువెచ్చగా తాగడం ఉత్తమం. అలాగే ఖాళీ పొట్టతో ఈ టీ సేవించడం కూడా అంత మంచిది కాదు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి జరిగి కడుపు మంట, నొప్పి లాంటివి రావచ్చు లేదా జీర్ణక్రియ సరిగా అవ్వకపోవచ్చు.green tea side effects

కనుక రెండు భోజనాల సమయాలకు మధ్యలో సేవించడం ఎంతో మంచిది. గ్రీన్‌ టీలో తేనె రంగరించి తాగితే చాలా ఉపయోగం. కానీ టీ వేడిగా మరుగుతున్నప్పుడు కలిపితే తేనెలోని పోషకాలు నశిస్తాయి. గోరువెచ్చగా మారాక కలుపుకోవడం మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా గ్రీన్‌ టీని కూర్చుని ప్రశాంతంగా సేవించాలి.

click here for more interesting facts at mirchipataka

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here