ఏ పి నిర్ణయంకు తీవ్ర వ్యతిరేకం : కే సి ఆర్

0
84

కృష్ణా నది నుంచి 10 TMC ల నీటిని తరలించేలా కొత్త ఎత్తిపోతల పథకం ప్రారంభించాలంటూ ఏ పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నామని కెసిఆర్ వెల్లడించారు. ఈ నిర్ణయం రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకమని అయన అన్నారు. ఏ పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కెసిఆర్ ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మహబూబ్ నగర్ ,నల్గొండ , ఖమ్మం జిల్లాల మంత్రులతో పాటు, ఇంజినీర్లు ,అడ్వకేట్ జనరల్ కూడా హాజరయ్యారు.

‘అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా ఏ పి ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్ ను తలపెట్టింది. ప్రాజెక్ట్ నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలనీ కృష్ణా నది యాజమాన్య బోర్డ్ లో ఫిర్యాదు చేస్తాం. శ్రీశైలం లో నీటిని లిఫ్ట్ చేయడానికి ఏకపక్షం గ నిర్ణయం తీసుకోవడం చాలా భాదకరం. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందాం అనే ప్రయత్నానికి ఇది విఘాతం కల్గించింది. రాష్ట్ర ప్రయాజనాలకు భంగం కల్గితే రాజీ పడే ప్రసక్తే లేదని ” కెసిఆర్ స్పష్టం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here