ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

0
117

మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురి అయ్యారు. ఛాతిలో నొప్పి రావడం తో ఆయనను ఢిల్లీ లో ఎయిమ్స్ లో చేర్పించారు. ఆదివారం రాత్రి 8 :45 గంటల సమయంలో ఆయనను హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అయన గుండె చికిత్స విభాగానికి చెందిన కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీష్ నాయక్ పర్యవేక్షణలో ఉన్నారు.

మార్చిలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేయడానికే ముందే మన్మోహన్ సింగ్ కు ఆరోగ్యం బాగాలేకపోవడం తో అయన వ్యక్తిగత వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. 2009 లోను మన్మోహన్ సింగ్ కు ఎయిమ్స్ లో బైపాస్ సర్జరీ జరిగింది. భారత దేశ ప్రధాన మంత్రిగా 2004 లో బాధ్యతలు స్వీకరించారు. 1991 లో ఆర్థిక శాఖ మంత్రి గ ఉన్నపుడు భారత దేశ ఆర్థిక సంస్కరణలలో కీలక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి గ గుర్తింపు ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here