ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ప్రధాని మోడీ గారు హామీ ఇచ్చారా?

158
modi helping to jagan

ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్ ఒంటరి వాడుగా కనిపిస్తున్నారు. జగన్ మీదకు విమర్శలు చేయడానికి టీడీపీ మరియు బీజేపీ ఇతర అన్ని పార్టీలు కూడా రెడీగా ఉంటున్నాయి. టీడీపీలో ఉన్న నాయకులు అయితే సరే సరి… రాజకీయంగా జగన్ మీద విమర్శలు చేయవచ్చు కానీ ఇలాంటి సమయం సందర్భం లేకుండా కూడా విపక్షాలు రెచ్చిపోవడం ఏపీ లో ఉన్న ప్రతీ ఒక్కరూ చూస్తూనేవున్నారు..!

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రధాని మోడీ గారు ఏపీ సీఎం జగన్ కి అండగా నిలుస్తున్నారు. ఆయన దేశానికి తండ్రిగా ఉంటున్నారు. ఇక జగన్ విషయంలో కూడా ఆయన మొదటి నుంచి ఆప్యాయతను చూపిస్తూనేవున్నారు. ఇపుడు కరోనా వైరస్ వ్యాపించి ఉన్న సమయంలో కూడా దేశ ప్రధాని మోడీ చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. ఇలా తరచూ ఫోన్ చేసి మరీ కరోనా వైరస్ నియంత్రణకు ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి స్వయంగా మోడీ గారు తెలుసుకుంటున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ గారితో కూడా కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలు గురించి ఎప్పటికపుడు ప్రధానికి వివరిస్తున్నారు. ఇంకా మోడీ గారు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటున్నారు.

ప్రధాని మోడీ కూడా తీసుకుంటున్న చేర్యాలకి మెచ్చుకుంటున్నారు. సరిగ్గానే ఏపీ సర్కార్ వైరస్ విషయంలో స్పందిస్తోందని కితాబు కూడా ఇస్తున్నార‌ని అంటున్నారు. ఇటీవల దక్షిణ కొరియా నుంచి రాపిడ్ కిట్లు తెప్పించి మరీ కరోనా వైరస్ టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా జగన్ విషయాన్ని కూడా తెలిపారు దానికి ప్రధాని మోడీ గారు కూడా మెచ్చుకున్నట్లుగా చెబుతున్నారు.

ఇక ఆంద్రప్రదేశ్ కి సమంధించి ఏమైనా సమస్యలు ఉంటే తనతో సంప్రదించాలని కూడా ప్రధాని జగన్ని కోరడం విశేషం, తానున్నానని ప్రధాని మోడీ భరోసాను ఇవ్వడం ఈ టైంలో ఏపీకి ముఖ్యంగా జగన్ కి మంచి ఊరటగా వుంది అని చెబుతున్నారు. ఏపీలో చూస్తే బీజేపీ నేతలు సైతం ప్రతీ దానికీ జగన్ మీద విమర్శలు చేస్తూనేవున్నారు. దానికి రాపిడ్ కిట్ల కొనుగోలు విషయమే ఒక్క పెద్ద ఉదాహరణ. అవినీతి బాగా జరిగిపోయంది అని నానా గొడవ చేస్తున్నారు. చివరికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంది అని కూడా చెప్పలేదు, ఎక్కడ టీడీపీ కంటే వెనకబడిపోతామోనని బీజేపీ నాయకులు జగన్ మీద ఇలా విమర్శలు చేస్తున్నారు అని కూడా అంటున్నారు. ఇక మొత్తం మీద చూస్తుంటే ఏపీలో బీజేపీ ఎలా ఉన్నా కూడా మోడీ గారు మాత్రం సానుకూలంగా స్పందించడం మంచి పరిణామమే అని అంటున్నారు ఏపీ నాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here